Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంకర్నూలుతాజా వార్తలు

ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై  చర్యలలో  నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవో

ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై  చర్యలలో  నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవో

ఆర్వో ఆదేశాలను ధిక్కరిస్తున్న రూరల్ ఎంపీడీవో

విచారణ చేయు బాధ్యత మరచి చర్యలకు ఎవరైనా ఆధారాలు ఇస్తేనే చర్యలా.?


అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10:స్థానిక రూరల్ మండల పరిధిలో గల కక్కలపల్లి రూరల్ సచివాలయంలో కొద్ది రోజుల క్రితం వాలంటీర్ల రాజీనామాలకు ప్రభుత్వ విధులలో గల అదే సచివాలయ చిరు ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ వాలంటీర్లకు ఫోన్ ద్వారా రాజీనామాలు చేయాలన్న వాటిపై కథనాలు ప్రచురణ కాగా వాటి పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు రూరల్ ఎంపీడీవో తూతూ మంత్రంగా విచారణ చేపడుతూ రాజీనామాలు చేసిన వాలంటీర్లను విచారణ నిమిత్తం కార్యాలయానికి ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన అదే కంప్యూటర్ ఆపరేటర్ చే రాజీనామాలు చేసిన వాలంటీర్ల ఇళ్ల వద్దకు వెళ్లి విచారణను తప్పుదోవ పట్టిస్తూ వాలంటీర్లను ఎంపీడీవో కార్యాలయానికి పంపించగా విచారణ కూడా అదే కంప్యూటర్ ఆపరేటర్ కనుసన్నల్లో జరిగినది.

వీటి పై రూరల్ ఎంపీడీవో స్పందిస్తూ రాజీనామాలను విచారణ పూర్తయ్యేంతవరకు  అంగీకరించమని రాజీనామాలు ఇచ్చిన రోజే రాజీనామాలను అంగీకరించినట్టు ఆలస్యంగా వివరాలు వెల్లడించారు. అలాగే ఏదైతే రాజీనామాలకు ప్రభుత్వ విధులలో ఉన్న చిరు ఉద్యోగి ఫోన్ చేశారన్న ఆరోపణను ఉద్దేశించి సచివాలయంలో కాకుండా ఎంపీడీవో కార్యాలయానికి నేరుగా వచ్చిన వారి రాజీనామాలే అంగీకరించామంటూ ఎంపీడీవో కార్యాలయానికి రాని వాలంటీర్ల రాజీనామాలను కూడా ఎంపీడీవో అప్పుడే అంగీకరించినట్లు ఆలస్యంగా వెల్లడించారు.

ఇదే చిరు ఉద్యోగి అయిన కంప్యూటర్ ఆపరేటర్ పై గతంలో ప్రభుత్వ అధికార పార్టీ ధోరణికి వ్యతిరేకంగా ఆరోపణలు కూడా నెలకొన్నాయి. ఇందువలన రాజకీయ అభిప్రాయాలను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేశాడా అన్న సందేహం నెలకొంది. వాలంటీర్ల రాజీనామాలకు కంప్యూటర్ ఆపరేటర్ ప్రోద్బల విషయమై వాస్తవమై తెలిసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను కూడా లెక్కచేయని వైనం. వీటికి కారణం డిపిఓ కార్యాలయంలో మా బంధువులు ఉన్నారంటూ ఎవరెన్ని వార్తలు రాసిన నన్నేమి చేసుకోలేరంటూ సదరు కంప్యూటర్ ఆపరేటర్ అవాకులు చవాకులు పేలడమే ఎంపీడీవో నిర్లక్ష్యానికి ప్రధమమయ్యాయి. 

గతంలో కక్కలపల్లి రూరల్ కి సంబంధించి టమోటా మండి నిర్వహణలో టమోటా మండికు వచ్చి పోయే వాహనదారులతో ఎలాంటి సుంకం వసూలు చేయకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా సుంకం  వసూలు జరుగుతున్నాయి అన్న వాటిపై పలుమార్లు రూరల్ ఎంపీడీవోను వివరణ కోరిగా ఇదే రూరల్ ఎంపీడీవో పొంతన లేని సమాధానాలు చెబుతూ పదేపదే పర్యవేక్షణ పట్ల నిర్లక్ష్యం చూపుతూ వచ్చారు. ఇప్పటికైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అని మరిన్ని వివరాలతో మరో శీర్షికలో మీ ముందుకు.

Related posts

Leave a Comment