- జాతి గర్వించదగ్గ నేత కర్పూరి ఠాకూర్…
- జననాయక్ సేవలను కొనియాడిన నాయీ బ్రాహ్మణ ఉద్యోగులు.
అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:భారత జాతే గర్వించదగ్గ నేత మన నాయీ బ్రాహ్మణ కులంలో జన్మించడం గర్వించదగ్గ విషయమని పలువురు నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జయమానెమ్మ కళ్యాణ మండపంలో జన నాయక్ కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న పురస్కారం లభించిన సందర్భంగా నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమానికి నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట రంగయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్డిటి తిప్పేస్వామి, నాయీ బ్రాహ్మణ మహిళ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉమా మహేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… స్వాతంత్ర సమరంలో కర్పూరి ఠాకూర్ పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. స్వాతంత్రం అనంతరం రాజకీయంగా క్రమశిక్షణ పట్టుదల అకుంఠిత దీక్షతో ఆయన రెండుసార్లు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ నిరాడంబరంగా జీవించారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడు జననాయక్ కు ఆయన 100వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గర్వించదగ్గ విషయం అన్నారు.
కర్పూరి ఠాగూర్ స్ఫూర్తిని ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు ప్రతినబూనారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీనివాసులు ప్రసాద్, కార్పొరేటర్ శేఖర్ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు సుబ్రమణ్యం శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి విజయనగరం నాగరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, పిడుగు శ్రీనివాసులు శ్రీధర్ శివప్రసాద్ పోతుల రాధాకృష్ణ బండి నాగరాజు సత్యనారాయణమ్మ ఉషా దేవి, అన్నపూర్ణమ్మ, హనుమేష్ బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.