బెల్లంకొండ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: బెల్లంకొండ ఆర్ అండ్ బి రహదారి మరమ్మతుల్లో భాగంగా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ విస్తీర్ణకు నాంది పలికారు. వివరాల్లోకి వెళితే గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల సమావేశానికి బెల్లంకొండ మండలానికి విచ్చేసిన పెదకూరపాడు శాసనసభ్యులు కు మండల నాయకులు బెల్లంకొండ ప్రధాన రహదారి విస్తీర్ణ తక్కువగా ఉందని తద్వారా రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడంతో దీనిపై స్పందించిన శాసనసభ్యులు ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి ఏడు మీటర్లు ఉన్న ఆర్ అండ్ బి రహదారిని కాస్త ఐదు మీటర్లు పెంచి మొత్తం 12 మీటర్లు బెల్లంకొండ ప్రధాన రోడ్డు విస్తరణ చేసేలాగా ఆర్ అండ్ బి అధికారులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు.
దీంతో ఆర్ అండ్ బి అధికారులు శనివారం హటాహుటిన బెల్లంకొండ ప్రధాన సెంటర్లో ఇరువైపులా రెండున్నర రెండున్నర మీటర్ల చొప్పున ఇరువైపులా మట్టిని తొలగిస్తూ మరమ్మత్తులు చేపట్టారు. దీంతో బెల్లంకొండ మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఇరుకు రహదారి ఆపై కుదించి మరి రహదారి నిర్మించడంతో రాకపోకలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో శాసనసభ్యులు దృష్టికి స్థానిక నాయకులు తీసుకురావడంతో దీనిపై దృష్టి చారించిన శాసనసభ్యులు. వెంటనే విస్తరణ పెంచి తగిన మరమ్మతులు చేస్తున్నందుకు మండల ప్రజలు శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.