స్మార్ట్ మీటరును అమర్చుతున్న సిబ్బంది.
సత్తెనపల్లి, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: సత్తెనపల్లి పట్టణంలో వివిధ వ్యాపార సంస్థలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్పాట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ విద్యుత్ శాఖ ఏఈ కిరణ్ తెలిపారు.పట్టణంలో ఇప్పటి వరకు షుమారు 1700 స్మార్ట్ మీటర్లు బిగించామన్నారు. ఈ స్మార్ట్ మీటర్లను గత మూడు నెలలుగా బిగిస్తున్నామని, మొదట పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ,ఇప్పుడు పట్టణంలోని వివిధ వ్యాపార సంస్ధలకు,అనంతరం గృహాలకు అమర్చనున్నట్లు వివరించారు.తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి బిగిస్తున్నారని, కావున వినియోగ దారులు సహకరించాలని ఏఈ కిరణ్ కోరారు.