Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

బెల్లంకొండ ఆయుర్వేద వైద్యశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవము

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నందు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆయుష్ వైద్యాధికారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అయిన గడ్డపర్తి జ్యోతి సముద్రం కి జన ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో నెలవారి సమీక్ష జరిపి ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని తల్లిని పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు అంటూ తెలియపరచి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియపరచి సర్పంచ్ ని ఘనంగా శాలువా పూలగుచ్చంతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి సముద్రం మాట్లాడుతూ వైద్యశాల నందు లభించు సేవలను కొనియాడారు డాక్టర్ మరియు వైద్య సిబ్బంది యోగా టీచర్లు మండలంలోని అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ యోగా నేర్పిస్తూ ఇంకా ఆయుష్ వైద్య సేవలను విస్తరించాలని తెలియపరిచినారు ఈ కార్యక్రమంలో జన ఆరోగ్య సమితి కమిటీ సభ్యులు కృష్ణ, కాశయ్య ఆసుపత్రి సిబ్బంది వెంకటరామయ్య యోగా టీచర్లు భూఖ్య హనుమంతరావు నాయక్ కోటేశ్వరమ్మ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment