Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

విద్యుత్ చార్జీల పెంపుతో పేద ప్రజలపై 57 వేల కోట్ల భారం…

గన్నవరం(హనుమాన్ జంక్షన్), జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు తదితర విషయాల మీద సోమవారం ఉదయం బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ 11 కే.వీ సబ్ స్టేషన్ దగ్గర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు నేతలు నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఇదే విషయం మీద హనుమాన్ జంక్షన్ సిపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏ. శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.17,093 కోట్లు భారం వేసిందని ఇదే కాక రూ.37,500 కోట్లు కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి మొత్తం రూ.57,188 కోట్లు భారం విద్యుత్ వినియోగదారులపై మోపిందని విమర్శించారు.

రూ.61,000 విలువచేసే ట్రాన్స్ఫార్మర్ను రూ.1,30,000 కు పెంచి అధికార పార్టీ బినామీ కంపెనీ అయిన శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు భారీ సంఖ్యలో కొనుగోళ్లు జరిపి రూ. 2,629 కోట్ల చెల్లించారని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటాన్ని దేశంలోని 11 రాష్ట్రాలతో పాటు దేశంలోని రైతు సంఘాలన్నీ వ్యతిరేకించినా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తలోగ్గి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు పూనుకుని రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగించిందని అన్నారు. ప్రభుత్వానికి భారంగా మారే విద్యుత్తుకు నగదు బదిలీ పేరుతో జరిగే మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని,పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దయ్యాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుబోయిన శివయ్య, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు వేగిరెడ్డి పాపారావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మజ్జిగ నాగరాజు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గండేపూడి నితీష్ కుమార్, కోమర్తి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment