Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

అన్నా ఓ జగనన్న ఎక్కడన్నా మా జాబ్ – బి.జె.వై.ఎమ్

  కాకినాడ, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 10: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ గారి ఆర్డ్వర్యంలో జాబ్ కేలండర్ పై కాకినాడ లో ఉన్న ధర్నా చౌక్ వద్ద అన్నా ఓ జగన్ అన్న ఎక్కడ అన్న మా జాబ్ అని ధర్నా చేయడమైనది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు సంవత్సరానికి లక్ష ఉద్యోగాల జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తాననీ హామీ ఇచ్చి నిరుద్యోగుల తో ఓట్లు వేయించుకొని అధికారం లోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో కేవలం 10 వేల ఉద్యోగాలకి మాత్రమే జాబ్ క్యాలండర్ ఇచ్చి నిరుద్యోగులను ఈ జగన్ మోహన రెడ్డి మోసం చేసారని తెలియచేశారు.

యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని మెగా Dsc వెంటనే విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి యెనినిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలుపుకొక పోతే వచ్చే ఎన్నికల్లో 175 నియోజక వర్గాలలో ఓటమి తప్పదు అని తెలియ చేశారు అనంతరం యువమోర్చ నాయకులు కలెక్టర్ కృతిక శుక్ల గారిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రీకాకుళం ఇంచార్జ్ పెద్దిరెడ్డి రవి కిరణ్, యువమోర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ర పాపారావు, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రీ సత్యనారయణ రాజు, వాసంసేట్టి వెంకటేష్, వీరబాబు , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, కవికొండల భీమసేఖర్, కుండల సాయి , యేసు, గొల్లపల్లి శివ, అప్పాజీ, దిలీప్ కుమార్ సదనాని తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment