పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ జైలును సందర్శించిన సత్తెనపల్లి మండల న్యాయసేవాధికర కమిటీ చైర్మన్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయ కుమార్ రెడ్డి .ముందుగా అక్కడ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నవ లేవా అనే దాన్ని నిశితంగా పరిశీలించారు.అంతేగాక అక్కడ ఉన్న ఆహార పదార్థాలను మరియు సరుకుల నాణ్యత పరిశీలించారు.సత్తెనపల్లి కీ సబ్ జడ్జి గా నూతనంగా వచ్చిన తరువాత తొలిసారిగా సందర్శించారు.అక్కడ ఉన్న రిమాండ్ ముద్దాయిల తో వారిని అడిగి అక్కడ అందుతున్న సౌకర్యాలు,వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు .ఆర్ధిక స్తోమత లేని వారికి ఉచిత న్యాయం అందించే సదుపాయం చట్టం మీకు అందిస్తుంది అని అన్నారు.ఆయన వెంట ప్యానల్ న్యాయవాది బి.ఎల్.కోటేశ్వరరావు,జైలు సూపర్డెంట్ వెంకటరత్నం లు పాల్గొన్నారు…
