సత్తెనపల్లిరూరల్,ఏప్రిల్16,జనసేన ప్రతినిధి….
ఈ రోజు ఉదయం 8:30 గంటలకు గుడిపూడి గ్రామం,సత్తెనపల్లి మం,నందు రెండవ విడత రీ-సర్వే లో బాగంగా గుడిపూడి గ్రామం నందు కే.ఎస్ .చక్రవర్తి,తహశీల్దార్ సత్తెనపల్లివారి చే భూమి పూజ చేసి, ర్యాలీ నిర్వహించడమైనది,
తహశీల్దార్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో చేపట్టిన భూ సర్వే, ను తిరిగి సుమారు 115 సంవత్సరముల తరువాత ప్రభుత్వం వారు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం తో మరలా రీ- సర్వే జరుగుతున్నదని, భూ వివాదముల పూర్తి ప్రక్షాళనములకు రీ -సర్వే ఉపయోగపడుతుందని,
ప్రతి రైతు వారి హక్కు పత్రము లతో వారి వారి సర్వే నంబర్ల లో సర్వే జరుగుచున్నప్పుడు భూమి పైకి హజరై తమ భూ-సమస్యలు పరిష్కారించు కోనవలసినదిగా తెలియ జేసియున్నారు, సదరు గ్రామ సభ నందు రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్,ఎన్.రవికుమార్, ఎంఆర్ఐ బి .బోసుబాబు,మండల సర్వేయర్..విజయ్, గ్రామ పెద్దలు, లగడపాటి గజానన,సర్పంచ్ టి.తిరుపతిరావు,ఎంపీటీసీ .మర్రి పూర్ణయ్య,గద్దే ఆంజనేయులు,కోనకంచి పుల్లారావు,గ్రామ పెద్దలు,సర్వేయర్లు,గ్రామ రెవిన్యూ అదికారులు,రైతులు పాల్గొని యున్నారు.


