Janasena News Paper
పల్నాడు

685 వ రోజు భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో ఇద్దరు దాతల సహకారంతో 44 మంది నిరుపేదలకు, వృద్దులకు,యాచకులకు బోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.

శనివారం ఉదయం 11 గంటలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గీతా మందిరం వద్ద మంగళగిరి వాస్తవ్యులు కీర్తిశేషులు తొండేపు వెంకట నాగ చలపతిరావు గారి పుణ్య తిథి సందర్భంగా వీరి కుమార్తె,అల్లుడు అయినవోలు కోటేశ్వరరావు ధర్మపత్ని కల్పన గార్ల ఆర్ధిక సహాయంతో 14 మందికి  మరియు సత్తెనపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు వనమా కోటేశ్వరరావు పుణ్య తిథి సందర్భంగా వీరి కుమారులు వనమా లక్ష్మీనారాయణ ,వనమా మల్లయ్య,వనమా శ్రీనివాసరావు గార్ల ఆర్ధిక సహాయంతో 30 మందికి మొత్తం 44 మందికి పైన తెలిపిన ఇద్దరు దాతల సహకారంతో బోజన ప్యాకెట్లను పంపిణీ చేయటం జరిగింది.కీర్తిశేషులు అయిన  ఇద్దరి యొక్క పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలి అని భరతమాత అన్నప్రసాద వితరణ పథకం తరుపున కొరటం జరిగింది.ఈ సందర్బంగా భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి,సీనియర్ న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనాటి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు, ఈనాటి కార్యక్రమంలో సేవలు అందించిన కుంచనపల్లి శ్రీనివాసరావు కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

Leave a Comment