
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనసేన, ఫిబ్రవరి 09: శేరిగూడ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వనస్థలి క్రాంతి మరియు లయన్స్ క్లబ్ ఇబ్రహీంపట్నం వారి ఆధ్వర్యంలో శ్రీ రంగారెడ్డి హెల్త్ కేర్ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లయన్ పాండురంగారెడ్డి, లయన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి,లయన్ అఖిల యాదగిరిరావు,లయన్ డాక్టర్ మర్మరాజు, లయన్ సాదు శ్యాంప్రసాద్, లయన్ లక్ష్మి మూర్తి, లయన్ ఎం వాసుదేవరావు, లయన్ సాధు కృష్ణ కిషోర్, లయన్ బాలరాజ్, లయన్ భీమ్ రావు, సంధ్యారాణి, మరియు డాక్టర్ తేజస్విని రెడ్డి, డాక్టర్ రోస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

