Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణనేరాలుయాదాద్రి భువనగిరి

వైద్యం వికటించి యువకుడు మృతి..

వైద్యం వికటించి యువకుడు మృతి..

యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి డిసెంబర్ 1 : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నా అవగాహన లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అమాయక ప్రజలు ప్రాణాలుపోగొట్టుకుంటున్నారు.తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకొన్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుందిి. భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడుత కర్ణాకర్ (32 ) గురువారం సాయంత్రం కడుపు నొప్పితో ఒక ప్రయివేటు ఆసుపత్రి నర్సింగ్ హోమ్ లో చేరాడు.

చికిత్స అందించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ ఆసుపత్రి ముందు మృతుని కుటుంబ సభ్యులు,బందువులు ఆందోళనకు దిగారు.మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన కరుణాకర్ కడుపునొప్పితో ప్రయివేటు నర్సింగ్ హోమ్ చేరాడని చెప్పారు. చికిత్స కొరకు కరుణాకర్ ను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని అతనికి వైద్యం నిమిత్తం ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలాడని అన్నారు. అనంతరం తమకు తెలియకుండా కరుణాకర్ ను అత్యవసర చికిత్స కొరకు వారి ఆంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారని చెప్పారు.హైదరాబాదు లో మరో ఆసుపత్రి కి వెళ్లేలోగా మార్గమధ్యలోనే కరుణాకర్ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని కానీ కరుణాకర్ కు నర్సింగ్ హోం లో సరైన చికిత్స అందించక పోవడంవల్ల చనిపోయారని ఆరోపించారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతో కరుణాకర్ మృతి చెందాడని ఆస్పత్రి ముందు కరుణాకర్ మృతదేహాం తో కుటుంబ సభ్యులు బంధువులు ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇదే నర్సింగ్ హోమ్ లో ఇలాంటి సంఘటనలు జరిగిన అధికారులు చర్యలు తీసుకోలేదని పలువురు విమర్శించారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు కోరారు .ప్రజారోగ్య పరిరక్షణ కొరకు జిల్లా అధికారుల స్పందించాలని జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చొరవ తీసుకొని ఆస్పత్రి పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

Leave a Comment