June 20, 2026
Janasena News Paper
అంధ్రప్రదేశ్

అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు

ఆనందరావు చాలెంజ్ విసురుతున్నా నిరూపించు

మీడియా సమావేశంలో మంత్రి విశ్వరూప్ సవాల్


జనసేన ప్రతినిధి, అమలాపురం,ఏప్రిల్ 12
గురువారం అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పై చేసిన విమర్శలకు విశ్వరూప్ కౌంటర్ ఇచ్చారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఒక్క అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి ఎవరిని తీసుకోలేదు అన్నారు. తనపై ఆరోపణలు చేసిన అమలాపురం టీడీపీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు కి  నేను అవినీతి చేసినట్లు అయితే అది నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఆనందరావు అవినీతి మరకలు నాకు పూసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు అన్నారు. ఆనందరావుకు చాలెంజ్ విసురుతున్న నిరూపించు అని సవాల్ విసిరారు.

Related posts

Leave a Comment