•25 కోట్ల నిధులు విడుదల
•హర్షం వ్యక్తం చేసి మండల బీసీ సెల్ గుంజ గంగారావు
బెల్లంకొండ,అక్టోబర్ 26, జనసేన ప్రతినిధి

అమరావతి నుండి బెల్లంకొండ రహదారి నిర్మాణం కొరకు స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను మరియు ఆర్దిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను బీసీ జనార్దన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.విజ్ఞప్తి చేసిన నెల రోజుల్లోనే 25 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు.అని ప్రభుత్వమునకు ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో రహదారి నిర్మాణం పనులు ప్రారంభించి తన హయాంలో రహదారి పూర్తి చేస్తానని హామీ ఇచ్చినందుకుగాను చండ్రాజుపాలెం గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి శనివారం కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ..గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి పనులు జరగలేదని ఎమ్మెల్యే ప్రవీణ్ కృషివల్లే నియోజకవర్గ ఎంతో అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రవీణ్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందరాజుపాలెం సొసైటీ చైర్మన్ ఓర్చు ఆనంద్,గ్రామ పార్టీ ఓర్చు రాంబాబు,ఏసు పాదం,నితీష్ మణికంఠ లక్ష్మయ్య, కొండ తదితరులు పాల్గొన్నారు.

