ప్రజల తరపున కన్నా కు ధన్యవాదాలు
ఎగుడుదిగుడు రోడ్డుకు మరమ్మతులు


ఎట్టకేలకు సిపిఐ నాయకులు ఇటీవల సత్తెనపల్లి రోడ్డెక్కి చేసిన ఆందోళన ఫలించింది. ఇరువురి పుణ్య దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న ఎగుడుదిగుడు రహదారికి తక్షణ మరమ్మత్తులు చేపట్టే విధంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనితో సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు ఎగుడు దిగుడు రోడ్లకు మోక్షం లభించింది. ఎట్టకేలకు సోమవారం సంబంధిత అధికారులు రోడ్ల నిర్మాణ మరమ్మతులకు శ్రీకారం చుట్టడంతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. సిపిఐ పార్టీ నాయకుల తరఫున ప్రజల తరపున సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ పార్టీ సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి లక్ష్మీ చెన్నకేశవ, ఏ ఐ టి యు సి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కంబాల శ్రీనివాస్, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు శేషయ్య లు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణకు మీడియా ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు.
సత్తెనపల్లి పట్టణ ప్రజలు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

