Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం “మాజీ ఎమ్మెల్యే దాట్ల”

జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, ఫిబ్రవరి 5: రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జయహో బిసి కార్యక్రమం ఈరోజు ఐ పోలవరం మండలంలో ఐ పోలవరం గ్రామం సాయిబాబా గుడి వద్ద మండల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు లంకే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నంటే ఉందని, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు తగిన గుర్తింపు లభించిందని, నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అమలు జరిపిందని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది శాతం తగ్గించి సుమారు 16 వేల స్థానిక సంస్థల పదవులు బీసీలు కోల్పోయిందని, బిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకొందని ఆదరణ పథకం ద్వారా చేతి పనిముట్లు అందజేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిందని, ఈ వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 57 బిసి కార్పొరేషన్ లో ఏర్పాటుచేసి ఒక్కరికి నిధులు లేకుండా కుర్చీలు కూడా లేకుండా బీసీలను అవమానపరిచిందని ఆయన అన్నారు.

మరొక్క అతిధి జనసేన రాష్ట్ర పిఎసి సభ్యులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రశ్నించే వాడిపై దాడులు జరుగుతున్నాయని రాబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందని యువతకు సరైన ఉద్యోగాలు కల్పించి బంగారు భవిష్యత్తు కల్పిస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, గంజ సుధాకర్, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, సాగి సూరిబాబు రాజు ,కాకర్లపూడి రాజేష్, మద్దింశెట్టి పురుషోత్తం, మందాలగంగ సూర్యనారాయణ, తాడి నరసింహారావు, పిల్లి నాగరాజు, వాడ్రేవు వీరబాబు, దాసరి జగేదీస్వరి,సాకా సీతాదేవి, బీర సత్య కుమారి, వాసంశెట్టి అమ్మాజీ టేకుమూడి లక్ష్మణరావు, బొంతు శ్రీరాములు, దాట్ల పృథ్వి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment