Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయం లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు…

సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో గురువారం ఘనంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ లు అభివృద్ధి చెందినపుడే దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆగమనం తో పల్లెల స్వరూపం మారిపోయిందని వెల్లడించారు.
గౌరవ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖామంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యం లో రాష్ట్రం లో పంచాయతీ లు అభివృద్ధి బాట లోపయనిస్తున్నట్లు చెప్పారు.
డిప్యూటీ ఎంపిడిఓ
ఏ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 29 అంశాల పై పంచాయతీలకు అధికారాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చడం లో పంచాయతీ రాజ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


పంచాయతీ రాజ్
ఏఈ రామ్ మోహన్ సింగ్ మాట్లాడుతూ జాతి పిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


ఆర్ డబ్లూ ఎస్ ఏఈ భావన మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ముందు ఉంటుందని వెల్లడించారు.


ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆవిర్భావ తీరు తెన్నులను వివరించారు.
ఈ కార్యక్రమంలో మండలంలో ఉత్తమ సేవలు అందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్ లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమంలో మండలం లోని గౌరవ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

Leave a Comment